Mahanaadu-Logo-PNG-Large

దెందులూరులో ప్రతి కుటుంబానికి అండగా ఉంటా

కూటమి కార్యకర్తలు స్వచ్ఛందంగా పనిచేశారు
టీడీపీ అభ్యర్థి చింతమనేని ప్రభాకర్‌ భరోసా

దెందులూరు, మహానాడు : ఎన్నికల వేళ ప్రతి కార్యకర్త స్వచ్ఛందంగా కృషి చేశారని, నియోజకవర్గంలోని ప్రతి కుటుంబానికి పార్టీలకు అతీతంగా అండగా ఉంటానని దెందులూరు నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చింతమనేని ప్రభాకర్‌ భరోసా ఇచ్చారు. పెదవేగి మండలం దుగ్గిరాలలోని క్యాంపు కార్యాలయంలో ఆయనను నియోజ కవర్గంలోని పలు గ్రామాల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు మర్యాద పూర్వకంగా కలిశారు. తమ గ్రామాల్లో జరిగిన పోలింగ్‌ సరళని చింతమనేనికి వివరించారు. ఈ సందర్భంగా చింతమనేని ప్రభాకర్‌ మాట్లాడుతూ పార్టీ గెలుపు కోసం విశేష కృషి చేసిన ప్రతిఒక్కరి సేవలను గుర్తించుకుంటామని, వారికి అన్ని విధాలా అండగా ఉంటామని తెలిపారు. నియోజకవర్గంలోని ప్రతి కుటుంబానికి పార్టీలకు అతీతంగా సంక్షేమం అందించి అండగా ఉంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏలూరు రూరల్‌ మండల అధ్యక్షులు నంబూరి నాగరాజు, పెదవే గి మండల అధ్యక్షుడు బొప్పన సుధా, పలువురు సీనియర్‌ నాయకులు, కొల్లేటి గ్రామాల పెద్దలు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.