– ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య
నందిగామ, మహానాడు: ప్రజా సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందుకెళుతోందని ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య అన్నారు. నందిగామ నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన కార్యక్రమం చేపట్టారు. నందిగామ మండలంలోని మునగచర్ల గ్రామంలో ఎన్ఆర్ఈజీఎస్ నిధుల క్రింద రూ. 20 లక్షల రూపాయల సీసీ రోడ్ల పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సూపర్ సిక్స్ పథకాలను అన్నివర్గాల ప్రజలకు అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ఎజెండాగా, ఇచ్చిన ప్రతి హామీని, మాటను కూటమి ప్రభుత్వం నెరవేరుస్తుందన్నారు.