పట్టణ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న కన్నా
పల్నాడు జిల్లా సత్తెనపల్లి, మహానాడు: సత్తెనపల్లి పట్టణం రఘురామ్ నగర్ ప్రజావేదికలో బుధవారం టీడీపీ పట్టణ విస్తృత స్థాయి సమావేశంలో సత్తెనపల్లి టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. ప్రస్తుత ప్రభుత్వ వైఖరిపై ప్రజలందరూ విసుగు చెంది ఉన్నారని, మన కూటమి ప్రభుత్వం రాగానే మనం చేయబోయే అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు తెలియజే యాలని పిలుపునిచ్చారు. ఎన్నికలకు మనమందరం కలిసికట్టుగా పనిచేయాలని, వైసీపీ అలజడలు సృష్టించినా గట్టిగా పోరాడాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు