ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు
జీవీకి అడ్వాన్సు బర్తడే విషెస్ తెలిపిన తెదేపా నేతలు
వినుకొండ, మహానాడు: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ప్రజా ప్రభుత్వం ఏర్పడిందని, ఆయన స్ఫూర్తితో అభివృద్ధిలో అందరూ భాగస్వాములు కావాలని వినుకొండ శాసనసభ్యులు జీవీ ఆంజనేయులు అన్నారు. బుధవారం ఉదయం గుంటూరులో ఉంటున్న వినుకొండ తెలుగుదేశం కుటుంబ సభ్యులు ఆయన నివాసంలో అడ్వాన్సు బర్తడే విషెస్ తెలియజేస్తూ కేక్ కటింగ్ కార్యక్రమాన్ని చేపట్టారు.
ఈ సందర్భంగా జీవీ ఆంజనేయులు మాట్లాడుతూ.. ఈ నెల 14వ తేదీన నా బర్తడే అయినప్పటికీ ముందస్తుగా నాకు శుభాకాంక్షలు తెలియజేసి కేక్ కట్ చేసినందుకు అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు. మీ అభిమానాన్ని మరువలేనని, నా గెలుపులో మీ అందరి సహకారం ఎప్పటికీ గుర్తుంచుకుంటానని అభినందనలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మహానాడు మీడియా అధినేత బోడెపూడి వెంకట సుబ్బారావు, ముక్కపాటి రవి, పత్తిపాటి ప్రసాద్, బొల్లా పేరయ్య, గోనుగుంట్ల వెంకటేశ్వర్లు, మక్కెన రామాంజనేయులు, బైరపనేని శ్రీనివాసరావు, గంగినేని గురుస్వామి, వజ్జా వీరాంజనేయులు, బోయపాటి పేరయ్య, పాపసాని నాగేశ్వరరావు, బుజ్జి, మేదరమెట్ల నాగేశ్వరరావు, గంగినేని బాబు తదితరులు పెద్ద ఎత్తున హాజరై ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులుకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.