Mahanaadu-Logo-PNG-Large

వన మహోత్సవంలో భాగస్వాములు కావాలి

– ఎమ్మెల్యే గళ్ళా మాధవి

గుంటూరు, మహానాడు: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్యం ప్రతిష్ఠాత్మకంగా వన మహోత్సవం కార్యక్రమం చేపట్టిందని, ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రజలందరూ భాగస్వాములు అయ్యి మొక్కలు నాటాలని, ఈ ప్రకృతిలో మానవుడి ప్రథమ లక్ష్యం పర్యావరణం పరిరక్షణ అని, ఖాళీ స్థలాల్లో వీరివిగా మొక్కలు పెంచి చెట్లను పరిక్షించుకుందాం అని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే గళ్ళా మాధవి అన్నారు. ఏపీ వన మహోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం 29వ డివిజన్ ఏటి అగ్రహారం, శ్రీరామ్ నగర్ లో ఎమ్మెల్యే మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ ఏడాది ప్రతి ఇంటిని, ప్రతి ఊరును పచ్చదనంతో ఉండేలా ప్రజలందరూ ఒక్కొక్కరు ఒక మొక్క నాటాలని, నాటే ప్రతి మొక్క రేపటి తరాలను మనమిచ్చే విలువైన కానుకగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక డివిజన్ టీడీపీ అధ్యక్షుడు సుభాని, పలుపులేటి నరసింహారావు, కురంగి శ్రీను, అమృతరావు, రామ్ ప్రసాద్, మల్లె ఈశ్వరావు, తదితరులు పాల్గొన్నారు.