అన్నీ ఉన్నాయ్.. ఇంటి ముందు డ్రైనేజీ తప్ప

మా ఇల్లు మూడు కోట్లు అయ్యింది.
మా కారు యాభై లక్షలు.
మా ఇంట్లో ఎవరి ఫోన్ చూసినా లక్షకు పైనే.
మా అబ్బాయిది స్పోర్ట్స్ బైక్, అదికూడా రెండు లక్షలు పైనే. మొన్ననే పది లక్షలు పెట్టి హోమ్ థియేటర్ చేయించాం.
మాకు అన్నీ ఉన్నాయ్..!
ఇంటి ముందు డ్రైనేజీ తప్ప. మేమే గొప్ప,
అహం బ్రహస్మిః అంటూ ఎక్కడ కక్కడ ప్రకృతిని చెరబట్టి చెట్లు నరికివేసి ఆటలాడుకొన్న, నయా సంపన్న వర్గాలు ప్రకృతి పగ బడితే ఎలా ఉంటుందో శాంపిల్ ఇది.
ఇకనైనా మేలుకోండి.
సముద్రం పెరుగుతుంది. ఋతువులు మారుతున్నాయి. ప్రకృతి హెచ్చరిస్తున్నది.
అర్ధం చేసుకొని ప్రకృతికి అనుకూలంగా జీవనం అలవాటు చేసుకోండి.