అరవిందబాబు నామినేషన్‌ ర్యాలీకి ఉప్పొంగిన జనం

కేరింతలతో హోరెత్తిన నరసరావుపేట వీధులు

పల్నాడు జిల్లా నరసరావుపేట, మహానాడు : నరసరావుపేట టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చదలవాడ అరవిందబాబు నామినేషన్‌ ర్యాలీ కార్యకర్తల కేరింతల నడుమ ఉత్సాహంగా సాగింది. నరసరావుపేట ప్రధాన వీధులు హోరెత్తాయి. మండుటెం డను లెక్కచేయకుండా నియోజకవర్గం నలుమూలల నుంచి వేలాదిగా నాయకులు, కార్యకర్తలు, ప్రజలు తరలివచ్చి ర్యాలీలో పాల్గొన్నారు. ఈ ర్యాలీ మల్లమ్మ సెంటర్‌ మీదుగా ప్రధాన రహదారికి చేరుకుంది. ర్యాలీలో ప్రజలు, మహిళలు, యువత అడుగడుగునా సంఫీుభావం తెలిపారు.