ఉమ్మడి గుంటూరు జిల్లాల మాజీసైనికుల కోసం క్యాంటీన్ ను పూర్తి స్థాయిలో అందుబాటులో కి తీసుకుని వచ్చినట్లు ఎన్ సి సి కల్నల్ సాజల్ కాంత్ దాస్ తెలిపారు.
నగరం లోని శ్యామలానగర్ లో NCC CSD కాంటీన్ ఆవరణం లో నూతనంగా నిర్మించిన కౌంటర్ లను ఆయన ప్రారంభించారు.
సీనియర్ మాజీసైనికులు విష్ణుబొట్ల రాజారామ్ మరొక కౌంటర్ ను ప్రారంభించారు. కాంటీన్ ఆవరణంలో ఏర్పాటుచేయబడిన నిర్మాణాలు, వైజాగ్ కాంటీన్ స్టోర్స్ తో చేస్తున్న లావాదేవీలు, మాజీసైనికుల కొరకు వివిధ పేర్లతో ఏర్పాటు చేసిన గ్రోసరీ సదుపాయాలను సులభతరంగా ఏర్పాటుచేసినట్లు ఆయన చెప్పారు.
బిల్లింగ్ కౌంటర్లు, నూతనంగా అందుబాటులోకి తీసుకువచ్చిన వస్తువులను, సెక్యూరిటీ వంటి విషయాలను కాంటీన్ కమిటీ చైర్మన్ కల్నల్ ఎస్ ఏం చంద్ర శేఖర్ వివరించారు. కాంటీన్ ఆవరణంలో నిర్మాణాలను ఏర్పాటుచేసిన మాజీసైనికులు, సూర్య తేజ సెక్యూరిటీ ఎం డి ఆళ్ల రాఘవరావు ను చైర్మన్ తల పాగా తొడిగి శాలువాతో సత్కరించారు.
ఈ కార్యక్రమం లో రాష్ట్ర మాజీసైనికుల లీగ్ (ఐ ఈ ఎస్ ఎల్ ) ముఖ్య కార్యదర్శి రెడ్డి శ్రీనివాస వార ప్రసాద్, రాష్ట్ర సమీకృత త్రిదళ మాజీసైనికుల కమిటీ ముఖ్య కార్యదర్శి కాలేషా, కాంటీన్ మేనేజర్ విశ్రాంత కల్నల్ ఉప్పల వెంకటేశ్వర్లు, గుంటూరు ఈ సి హెచ్ ఎస్ పోలీక్లినిక్ అధికారి విశ్రాంత కల్నల్ సుధాకర్, జనరల్ మేనేజర్ ఫణి కుమార్ పాల్గొన్నారు.