Mahanaadu-Logo-PNG-Large

బిగ్‌ బాస్కెట్‌లో గడువు తీరిన వస్తువులు

అధికారుల తనిఖీల్లో గుర్తింపు
తాత్కాలికంగా లైసెన్స్‌ రద్దు

హైదరాబాద్‌: కొండాపూర్‌ మసీదు బండలోని బిగ్‌ బాస్కెట్‌ గోడౌన్‌లో శుక్రవారం తనిఖీల్లో గడువు తీరిన వస్తువులను ఫుడ్‌ సేఫ్టీ అధికారులు గుర్తించా రు. చికెన్‌ మసాలా, చికెన్‌ సాసేజ్లు, పిజ్జా చీజ్‌, పన్నీర్‌, ఐస్‌క్రీమ్‌లు, పాల సీసా లు, థిక్‌ షేక్స్‌, ఇతర వస్తువులను కనుగొన్నారు. నిర్వాహకులకు నోటీసులిచ్చిన అధికారులు తాత్కాలికంగా లైసెన్సును రద్దుచేశారు. వినియోగదారులు వస్తువు లపై గడువు తేదీని చెక్‌ చేసుకోవాలని సూచించారు.