సమస్యాత్మక ప్రాంతాలలో డ్రోన్లతో నిఘా
మద్యం, ఇతర దుకాణాలను మూసివేయించాలి
అధికారులకు ఎస్పీ తుషార్ డూండి ఆదేశం
గుంటూరు: జిల్లాలో కౌంటింగ్ దృష్ట్యా జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా లాడ్జి, ప్రైవేటు గెస్ట్ హౌస్‌లు, ఇతర రిసార్ట్ హోటళ్లు తనిఖీలు నిర్వహించాలని అధికారులను జిల్లా ఎస్పీ తుషార్ డూండి ఆదేశించారు. గుంటూరు జిల్లాలో 144 సెక్షన్, 30 పోలీసు చట్టం అమలులో ఉందని, గుంటూరు జిల్లా అంతటా ప్రజలు గుంపులు గుంపులు గా ఉండరాదని పోలీసులకు సహకరించాలని కోరారు. పోలీసు అధికారులు, సిబ్బంది డ్యూటీ విషయంలో పాటించవలసిన జాగ్రత్తలు, ఎన్నికల మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ రూల్స్ ప్రకారం పనిచేయాలని విధుల్లో ఎటువంటి అలసత్వం వహిస్తే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కౌంటింగ్ ప్రక్రి య ముగిసే వరకు జిల్లాలో వైన్ షాపులు, రెస్టారెంట్లు, ఇతర అన్ని షాపులు మూసివేయించాలని అధికారులను ఆదేశించారు.
చెక్‌పోస్టుల దగ్గర తనిఖీలు నిర్వహించాలి
జిల్లాలో విజయోత్సవ ర్యాలీలు సభలో సమావేశాలు, బాణసంచా నిల్వ ఉంచే కేం ద్రాలు, ఫైర్ క్రాకర్స్ షాపులు మూసి వేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశిం చారు. సరిహద్దు చెక్‌పోస్టుల దగ్గర తనిఖీ చేసి అక్రమ రవాణాను అరికట్టాలని సూచించారు. మద్యం దుకాణాలు, వ్యాపార సముదాయాలు వద్ద సిబ్బందిని అప్ర మత్తం చేస్తూ, ముఖ్య కూడళ్లలో వాహనాలు తనిఖీ చేస్తూ అక్రమ రవాణాకు అవకాశం లేకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రైవేట్ గెస్ట్ హౌస్ లాడ్జిలు, రైల్వే, బస్ స్టేషన్‌లలో తనిఖీలు చేపట్టి కొత్త వ్యక్తుల వివరాలపై ఆరా తీసి ప్రయాణానికి గల కారణాలపై వాకబు చేసి నేర నియంత్రణ చర్యలు చేపట్టాలని అధికారులను హెచ్చరించారు.
సీసీ కెమెరాలతో నిఘా
గుంటూరు జిల్లాలో సమస్యాత్మక ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు కేంద్ర బలగాలతో నిరంతరం పర్యవేక్షించడం జరుగుతుందని అదేవిధంగా ఆయా ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశామని తెలిపారు. గుంటూరు జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా క్యూఆర్టీ బృందాల ద్వారా పర్యవేక్షిస్తున్నామని, ఏ చిన్న సంఘటన జరిగినా వెంటనే స్పందించే విధంగా శాంతి భద్రతలపై రాజీ పడే ప్రసక్తే లేదని తెలిపారు. రౌడీషీటర్లు, అల్లరి సృష్టించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటా మని హెచ్చరించారు. గుంటూరు జిల్లాలో సమస్యాత్మక గ్రామాలు, ప్రాంతాల్లో ప్రత్యేక పోలీస్ టికెట్లు ఏర్పాటు చేసినట్లు వివరించారు. అదేవిధంగా డ్రోన్ కెమెరా ల ద్వారా ఎప్పటికప్పుడు పరిస్థితులు గమనిస్తామని, జిల్లాలో నిరంతరం పోలీస్ పెట్రోలింగ్ నిర్వహించడం జరుగుతుందని చెప్పారు.