టీటీడీ విజిలెన్స్‌ అదుపులో ఫేక్‌ ఐఏఎస్‌!

శ్రీవారి వీఐపీ బ్రేక్‌ దర్శనానికి వచ్చి…
అనుమానంతో పట్టుకున్న అధికారులు

తిరుమల: ఐఏఎస్‌ అధికారినంటూ దందాలకు పాల్పడుతున్న ఓ వ్యక్తిని టీటీడీ విజిలెన్స్‌ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. జాయింట్‌ సెక్రటరీ హోదాలో గురువారం శ్రీవారి వీఐపీ బ్రేక్‌ దర్శనానికి వచ్చిన నరసింహారావు అనే వ్యక్తి సిఫార్సు లేఖ సమర్పిం చాడు. అయితే ఆయన తీరుపై ఈవో కార్యాలయ సిబ్బంది అనుమానంతో విజిలెన్స్‌ అధికారులకు సమాచారం అందించారు. దీంతో నిందితుడిని అదుపులోకి తీసుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. గతంలో విజయవాడ, గుంటూరులోనూ ఆయన ఇదే తరహా మోసాలకు పాల్పడినట్లుగా గుర్తించారు.