ఫేక్ జగన్… ఫేక్‌ ప్రచారాలు ఆపు!

– చీకటి జీవోలు, చీకటి లెక్కలు కాదు మావి…
– చదువు వస్తే చదువుకో.. కళ్ళుంటే చూడు..
– రూ. కోట్ల ప్రజాధనంతో పందికొక్కులా ఎగ్‌ పఫ్‌లు మెక్కావ్‌…
– నిప్పులు చెరిగిన మంత్రి లోకేష్‌

అమరావతి, మహానాడు: వరద బాధితులకు ఇస్తామన్న కోటిలో ఒక్క రూపాయి ఇప్పటికీ ఇవ్వలేదు ఫేక్ జగన్.. వరద బాధితులకు ఒక వాటర్ ప్యాకెట్ కానీ, ఒక బిస్కెట్ ప్యాకెట్ కానీ పంపిణీ చేయని ఫేక్ జగన్ వరద సహాయక చర్యలపై విషం కక్కుతున్నారని విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్‌ మండిపడ్డారు. ఈ మేరకు ఆయన బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. వరద ప్రాంతాల్లో కొవ్వొత్తులు, అగ్గిపెట్టెలకు 23 కోట్లు అంటూ ఫేక్ ప్రచారం చేయిస్తున్నారు. వీటికి ఖర్చు 23 లక్షలు కూడా కాలేదు. జగన్ చీకటి పాలనలో వెలువడిన చీకటి జీవోలు, చీకటి లెక్కలు కాదు కూటమి ప్రభుత్వానివి.. ఇవిగో ఖర్చుల లెక్కలు.. అన్నీ పారదర్శకంగా ఉన్నాయి.. చదువు వస్తే చదువుకో.. కళ్ళుంటే చూడు.. తాడేపల్లి ప్యాలెస్ కలుగులో దాక్కుని, ప్రజాధనం కోట్లు పందికొక్కులా ఎగ్‌ పఫ్‌లు మెక్కి, నిమ్మకాయ నీళ్లులా తాగేసిన ఫేక్ జగన్ ఇకనైనా నీ ఫేక్ ప్రచారాలు ఆపు! అని నిప్పులు చెరిగారు.