Mahanaadu-Logo-PNG-Large

నిరాశ, నిస్పృహలో నీలిపత్రికలో తప్పుడు రాతలు

-వెబ్‌ కాస్టింగ్‌ బటన్‌ నొక్కేది చంద్రబాబే అంటూ అసత్య ప్రచారం చేస్తున్నారు
 -సీఎస్‌ జవహర్‌రెడ్డి, పి.ఎస్‌.ఆర్‌.ఆంజనేయులు, రాజేంద్రనాథ్‌రెడ్డి, కొల్లి రఘురామిరెడ్డి మీ వారే కదా?
 -మా నాయకుడు హైజాక్‌ చేసి బటన్‌లు నొక్కుతుంటే మీ వాళ్లు చూస్తూ ఊరకుంటారా?
 -ఈ అబద్ధపు రాతలు రాస్తున్న ఒక చెత్త పత్రిక సాక్షి…అది రాసే రాతలు నమ్మకండి
 -ఏ పోలీసులు అయితే పిన్నెల్లికి సలాం కొట్టారో వారే ఆయనను బాదటానికి సిద్ధంగా ఉన్నారు
 -ఎమ్మెల్యే అయితే మాకేంటి… పిన్నెల్లి అయితే మాకేంటి తోలు వలుస్తామంటున్నారు
 -మాచర్లను వీడి పిన్నెల్లి సోదరులు పరారీలో ఉన్నారు.. ఇప్పుడు అక్కడి ప్రజలు స్వేచ్ఛగా తిరుగుతున్నారు
 -పోలీసులు చిత్తశుద్ధితో ఇన్వెస్టిగేషన్‌ చేస్తే ప్రతి కేసులో ఆయనను ఏ1గా చేర్చవచ్చు
 -144 సీట్లు వస్తాయని జగన్‌ ఇంకా మోసం చేస్తున్నాడు
 -కౌంటింగ్‌ ఏజెంట్లుగా ఉండటానికి కూడా వైసీపీ నేతలు భయపడుతున్నారు
 -టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య

మంగళగిరి, మహానాడు : ఎన్నికల రోజు నిశ్శబ్ద విప్లవం వైసీపీని కాలికిందేసి తొక్కేసిందని.. ఆ నిస్పృహ లో నీలిపత్రికలో తప్పుడు రాతలు రాస్తున్నారని, వెబ్‌ కాస్టింగ్‌ బటన్‌ నొక్కేది చంద్రబాబే అంటూ అసత్య ప్రచారం చేస్తున్నారని టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యు లు వర్ల రామయ్య మండిపడ్డారు. మంగళగిరి టీడీపీ జాతీయ ప్రధాన కార్యాల యంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఏ పోలీసులు అయితే పిన్నెల్లికి సలాం కొట్టారో..ఆ పోలీసులే పిన్నెల్లిని నేడు బాదటానికి సిద్ధంగా ఉన్నారు. మాచర్లలో ఉన్న పోలీసులు ఎమ్మెల్యే అయితే మాకేంటి పిన్నెల్లి అయితే మాకేంటి తోలు వలుస్తామంటున్నారు. రాజ్యంగమే సుప్రీం.. దాని ప్రకారమే అందరూ నడుచుకోవాలి. సీఎస్‌ జవహర్‌రెడ్డి, పీఎస్‌ఆర్‌ ఆంజనేయులు, రాజేంద్రనాథ్‌రెడ్డి, కొల్లి రఘురామిరెడ్డిలు మీ వారే కాదా..చంద్రబాబు హైజాక్‌ చేసి బటన్‌లు నొక్కుతుంటే మీ వాళ్లు ఊరుకుంటారా? బుద్ధిలేకుండా చంద్రబా బు బటన్‌ నొక్కుతున్నాడంటూ ఎలా ప్రచారం చేస్తారు? అని ధ్వజమెత్తారు.

సిగ్గులేని రాతలు రాస్తే ప్రజలు నమ్ముతారా?

సజ్జల ఒక అవగాహన రాహిత్యుడు. బొత్స ఏం చెబుతాడో ప్రజలకు అర్థం కాదు. ఓడిపోతున్నామన్న వాస్తవం అతనికి తెలియదు. వెబ్‌ కాస్టింగ్‌ ఎలక్షన్‌ కమిషన్‌ చేతిలో ఉంటుంది. దాన్ని పర్యవేక్షించే అధికారులు మీరు పోస్ట్‌ చేసిన వారే కదా? సాక్షి మోసపు పత్రిక, చెత్త పత్రిక, అబద్ధాలు రాసే పత్రిక. దాన్ని నమ్మకండి. ఎన్నికల రోజు చంద్రబాబు వార్‌ రూమ్‌లో కూర్చొని మానిటరింగ్‌ చేశారు. ఆయన పక్కనే నేను కూర్చున్నా. మాకు తెలియకుండా ఆయన ఏ బట న్‌ నొక్కలేదు. మేము చూడంది మీకు ఎలా కనిపించింది. బుద్ధిలేని, జ్ఞానం లేని, సిగ్గులేని రాతలు రాస్తే ప్రజలు నమ్ముతారా?

పిన్నెల్లికి నేడు తడిసిపోతుంది

వైసీపీ నేతలు చాలామంది అజ్ఞాతంలోకి వెళ్లారు. వైసీపీ నేతలను ప్రజలు తిరస్కరించారు. లోకమంతా కోడై కూసినా పిన్నెల్లి విధ్వంసం అందరి ఫోన్లకు వచ్చినా.. సజ్జలకు తెలియదటా? ధ్వంసం చేసిన ఈవీఎం బాక్సులో ఉన్న స్లిప్పు లు టీడీపీ మెజార్టీగా ఉండటంతో పిన్నెల్లి ఇష్టానురీతిన టీడీపీ నేతలపై దాడులు చేసుకుంటూ పోయాడు. టీపీ నేతలపై దాడిచేసిన పిన్నెల్లిని దగ్గర ఉండి పోలీసులు కారెక్కించి పంపడం సిగ్గుచేటు. పోలీసుల పేరు చెబితే నేడు పిన్నెల్లికి తడిసి పోతుంది. మాచర్లను వీడి పిన్నెల్లి సోదరులు పరారీలో ఉన్నారు.. ఇప్పుడు మాచర్ల ప్రజలు స్వేచ్ఛగా తిరుగుతున్నారు. ప్రజలకు పిన్నెల్లి ఒట్టి భద్రయ్యని తెలిసిపోయింది. పోలీసులు చిత్తశుద్ధితో ఇన్వెస్టిగేషన్‌ చేస్తే ప్రతి కేసులో పిన్నెల్లిని ఏ1గా చేర్చాలి.

చంద్రబాబు 27న రాత్రి తిరిగొస్తున్నారు

మాచర్లలో ఏ అధికారి నియామకం కావాలన్నా పిన్నెల్లి కాళ్లు పట్టుకోవాలా? ఇది భారత రాజ్యంగం. ఈరోజు పిన్నెల్లి మాచర్ల వెళ్లగలడా? పిన్నెల్లి బహిష్కరణ ఒక గుణపాఠం కావాలి. రాజ్యంగబద్ధంగా నడుచుకోవాలని చిలక్కు చెప్పినట్లు చెప్పినా జగన్‌రెడ్డి వినుకోలేదు. జగన్‌రెడ్డి లండన్‌లో బంగ్లా కొన్నాడని అతను అక్కడే ఉంటాడని వినిపిస్తున్న వార్తలు అతని సొంత విషయం నేను కలుగజేసు కోను. మా నాయకుడు చంద్రబాబు 27న రాత్రి తిరిగి వస్తున్నారు. ఓడిపోతు న్నామని వీళ్లకు తెలిసే అనిల్‌కుమార్‌ యాదవ్‌, కోడిగుడ్డు మంత్రి, పేర్ని నాని లాంటి నాయకుల నోర్లు మాతపడ్డాయని ఎద్దేవా చేశారు. 144 సీట్లు వస్తాయని జగన్‌ ఇంకా మోసం చేస్తున్నాడు. కౌంటింగ్‌ ఏజెంట్లుగా ఉండటానికి కూడా వైసీపీ నేతలు భయపడుతున్నారని వ్యాఖ్యానించారు.