అండగా నందమూరి, నారా కుటుంబాలు
గెలుపు కోసం మంగళగిరిలో ప్రచారం
అమరావతి: జగన్‌రెడ్డి వెంట ఆయన తల్లి లేదు. జగన్‌తో పాటు వైసీపీని ఓడిరచా లని సొంత చెల్లెలు షర్మిల, బాబాయ్ కూతురు సునీత ప్రచారం చేశారు. బావ బ్రదర్ అనిల్ తనదైన శైలిలో వాక్యం చెబుతూ జగన్ రెడ్డికి శాపనార్థాలు పెట్టాడు. జగన్ మోసాలు తెలిసిన జనం ఛీకొట్టగా.. జగన్ నేరాలకు బలైన కుటుంబసభ్యు లూ దూరం జరిగారు. తల్లి విజయలక్ష్మి జగన్ నుంచి ప్రాణభయంతో అమెరికా వెళ్లిపోయారని జోరుగా ప్రచారం జరిగింది. అక్కడి నుంచి తన కుమార్తెను గెలిపించాలని, అంటే వైసీపీని ఓడిరచాలని ఆమె రాసిన లేఖ పెనుసంచలనం అయింది. దీంతో జగన్ ఒంటరి పోరాటం చేశారు.
ఇదే సమయంలో టీడీపీ జాతీ య ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వెంట ప్రజలు, టీడీపీ కేడర్, నందమూరి-నారా కుటుంబాలు నిలిచాయి. ప్రజల సంక్షేమం, రాష్ట్ర రక్షణ లక్ష్యంగా టీడీపీ, బీజేపీ, జనసేన కూటమిగా ఏర్పడ్డాయి. ఈ కూటమికి జనం జై కొట్టారు. కూట మి విజయానికి కృషి చేసిన అందరికీ తమ కుటుంబాల నుంచి మద్దతు వెల్లువెత్తిం ది. టీడీపీ కూటమికి మద్దతుగా మామ నందమూరి బాలకృష్ణ, రామకృష్ణ, తమ్ము డు నారా రోహిత్, నందమూరి-నారా కుటుంబాలు మొత్తం ఎన్నికల ప్రచారంలోకి వచ్చాయి. రాష్ట్రవ్యాప్తంగా కూటమి అభ్యర్థుల కోసం లోకేష్ ప్రచారం చేస్తుండగా, లోకేష్ గెలుపు కోసం అన్నగారి కుటుంబమంతా మంగళగిరిలో ప్రచారం నిర్వహించింది.