-నిరుద్యోగం, ధరల పెరుగుదలకు బీజేపీ కారణం
-ఆదానీ, అంబానీలకు దోచిపెడుతున్నారు
-పంజాబ్ ఎన్నికల ప్రచారంలో మల్లు భట్టివిక్రమార్క
పంజాబ్: ఇండియా కూటమి అధికారంలోకి రాగానే రైతుల రుణమాఫీ చేస్తామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క హామీ ఇచ్చారు. సోమవారం పంజాబ్ రాష్ట్రం ఫరీద్‌కోట్ లోక్‌సభ పరిధిలోని కోటక్ పుర అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ వచ్చాక అగ్ని వీర్ స్కీంను రద్దు చేస్తుందని తెలిపారు. ప్రభుత్వాన్ని బిలియనీర్లు అయిన అదాని, అంబానీలు నడుపు తున్నారు, విమానాశ్రయాలు, రైల్వేస్టేషన్లు అదాని గ్రూపులకు విక్రయించి మోదీ దేశం పరువు తీశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
దేశంలో పెరిగిపోయిన నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, అవినీతి పరిస్థితులకు బీజేపీ తగిన మూల్యం చెల్లించుకుం టుందని తెలిపారు. అభివృద్ధి పనులు చెప్పుకోవాల్సిన ప్రధాని మోదీ మతం, మంగళసూత్రం, ముజ్రా వంటి వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమన్నారు. పాకి స్తాన్‌తో పోరాడి బంగ్లాదేశ్‌కు స్వతంత్రం తెచ్చిపెట్టాం. చైనా మన భూమిని ఆక్ర మించి ఇల్లు, రోడ్లు నిర్మిస్తున్నా ప్రధాని మోదీ మౌనంగా ఉండడం దేనికి సూచిక అని ప్రశ్నించారు.