అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం

– ఏపీకి చెందిన ముగ్గురు దుర్మరణం

అమరావతి, మహానాడు: అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఏపీకి చెందిన ముగ్గురు మృత్యువాతపడ్డారు. రెండు వాహనాలు ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు మరణించగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. దక్షిణ బాన్ హామ్ కు ఆరు మైళ్ల దూరంలో ఈ ప్రమాదం జరిగింది. మరణించిన వారిలో ఒకరిది తిరుపతి జిల్లా కాగా మరో ఇద్దరిది శ్రీకాళహస్తిగా తెలుస్తోంది. రాండాల్ఫ్ సమీపంలో మంగళవారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. ఐదుగురు ఎన్ఆర్ఐలు ప్రాణాలు కోల్పోగా, వీరిలో ఒక మహిళ సహా ముగ్గురు ఏపీలోని ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చెందిన వారు ఉన్నట్టు గుర్తించారు.