ముగ్గురు మృతి…ఇద్దరు పరిస్థితి విషమం
మృతులు ఏలూరు జిల్లా కొయ్యలగూడెం వాసులు
ఆగి ఉన్న లారీని ఢీకొన్న కారు
మితిమీరిన వేగమే కారణంగా నిర్ధారణ
నెల్లూరు జిల్లా కావలి, మహానాడు : నెల్లూరు జిల్లా కావలి సమీపంలోని ముసునూరు టోల్‌ప్లాజా దగ్గర బుధవారం తెల్లవారు జామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతిచెందారు. ఏలూరు జిల్లా కొయ్యలగూ డెంకు చెందిన జ్యోతి కల్యాణి, రాజీ, కుమార్ కారులో చెన్నైలో ఇమిటేషన్ గోల్డ్ కొనుగోలు చేసి తిరిగి వస్తుండగా తెల్లవారుజామున 3:30 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. ఆగి ఉన్న లారీని కారు ఢీకొనడంతో వారు ముగ్గురూ చనిపోయారు. వారితో పాటు కారులో ఉన్న మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. వారి పరిస్థితి విషమంగా ఉంది. సమాచారం అందుకున్న పోలీసుల ప్రమాద స్థలానికి చేరుకుని క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించా రు. కారు పూర్తిగా నుజ్జునుజ్జు అయింది. ఈ కారు ఏలూరు వైఎస్సార్ కాలనీకి చెందినదిగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.