ఉద్యానవనమంతా అనేక రకాలైన చెట్లతో నిండియున్నప్పటికీ అందులో ఏదేని ఒక చెట్టు సుగంధ సువాసన భరితమైన పుష్పాలతో విరబూసినచో, ఆ సుగంధ సుమనోహరమైన సువాసనలు ఆ వనమంతా వ్యాపించి ఆ పరిసర ప్రాంతమంతటినీ ఆహ్లాదపరచే వాతావరణాన్ని కలుగజేస్తుంది. వనములో ఉన్న జనులకి, వాహ్యాళికి వచ్చిన వారందరికీ కూడా మనోల్లాసాన్ని, ఉత్తేజాన్ని కలగ జేస్తుంది.తెలివితేటలు, సత్ప్రవర్తన, ధర్మ పరాయణత్వము, పరోపకార బుద్ధి కలిగిన సకల విద్యాపారంగతుడు అయినట్టి, సర్వలక్షణ శోభితుడైనట్టి సుపుత్రుడు కలిగినచో ఆ కుటుంబము అంతా ఎంతగా శోభించునో ఎంతగా వృద్ధి చెందునో, ఆ వంశానికి ఎంత పేరు ప్రఖ్యాతులు వస్తాయో అదే విధముగా సుగంధ పరిమళ భరితమైన ఒక్క పుష్పించిన చెట్టు వలన వనమంతా ఆహ్లాద భరితమౌతుంది. ఆ వనములో సంచరించే వారందరికీ మనోల్లాసాన్ని కలిగిస్తుంది.
సినిమా, రెండు సినిమాలతో ఆపేయడం లేదు. వారికి సినిమా తీసే శక్తి ఉంది కాబట్టి వరసగా సినిమాలు చేసేస్తున్నారు. అంటే ఆయా హీరోలు నిర్మాతలుగా వ్యవహరించకపోయినా వారి ఇన్‌ఫ్లుయెన్స్‌తో నిర్మాతలు వారి కొడుకులతో సినిమాలు చేస్తున్నారు. అలా వరసగా సినిమాలు చేసి ఆ హీరో ఫేస్‌ని ప్రేక్షకులకు బాగా అలవాటు చేసేస్తున్నారు., ఈ హీరోలకు బ్యాక్‌గ్రౌండ్ ఉంది కాబట్టి స్టార్ హీరోలు కాగలిగారు
సినీ పరిశ్రమలో ఒకే కుటుంబం నుంచి చాలా మంది హీరోలు రావడం కొత్తేమి కాదు. సినిమా పరిశ్రమ మొదలు నుంచి ఉన్నదే. ఒకే ఫ్యామిలీ నుంచి హీరోలు వస్తూనే ఉన్నారు. వాళ్ళకి వారసులు వస్తున్నారు. ఎక్కువగా వారసులు అంటే కొడుకులే వస్తారు. ఇప్పటికే చాలా మంది స్టార్ హీరోల కొడుకులు హీరోలుగా వచ్చారు. కాని ఇటీవల అల్లుళ్ళు వారసులుగా వస్తున్నారు. కొంతమంది స్టార్స్ అల్లుళ్ళు ఇప్పటికే ఇండస్ట్రీలో నిలదొక్కుకుంటే మరి కొంతమంది ఇప్పుడిప్పుడే ఎంట్రీ ఇస్తున్నారు.
తెలుగు ఇండస్ట్రీలో ఇప్పటికే చాలా మంది వారసులు ఉన్నారు. హీరోలు, నిర్మాతల తనయులు కూడా ఇప్పుడు హీరోలవుతున్నారు. అయితే అందులో కొందరు ఫుల్ సక్సెస్‌తో రన్ అవుతుంటే.. కొందరు మాత్రం వెనుకంజులోనే ఉంటున్నారు. సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడ్డాయి. ఆకట్టుకునే అందం, ఫిజిక్, నటన ఉన్నా కథల ఎంపిక విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోవడంతో ప్రయత్నాలూ విఫలం అయ్యాయి.
మంచు మోహన్ బాబు నట వారసుడి ఇండస్ట్రీకి పరిచయం అయిన మనోజ్. మనోజ్ బాల్యంలో తన పదోయేటనే మేజర్ చంద్రకాంత్ సినిమాలో నటించాడు. 2004లో దొంగ దొంగది సినిమాతో తెలుగు సినీ ప్రపంచానికి కథానాయకుడిగా పరిచయమయ్యాడు. కెరీర్ స్టార్టింగ్‌లో మంచి సినిమాలతో ఆకట్టుకున్న తరువాత తన ఫాం కోల్పోయాడు. వరుస ఫ్లాప్‌లు పలకరించటంతో సినిమాలకు గ్యాప్ ఇచ్చాడు. ఇక ప్రస్తుతం మళ్లీ అదే జోష్‌తో మంచు మనోజ్ సినిమాల్లో ఎంట్రీ ఇస్తున్నట్టు తెలుస్తోంది.
వారసత్వం వారసులకి సత్తువ నిస్తోందెమో కాని వారిని సినీ పరిశ్రమ అదరించాలంటే వారి స్వయంకృషి కూడా అవసరం. నటనా నైపుణ్యం కమర్షియల్ సినిమాని కావల్సిన మెళుకువలు నేర్చుకుంటూ తమని తాము నటులుగా నిరూపించుకోవాలి. కష్టపడి పనిచేయ్యాలి. వారికంటూ గుర్తింపు తెచ్చుకోవాలి. అలా గుర్తింపు తెచ్చుకున్న రాంచరణ్, మహేష్ బాబు, ఆల్లు ఆర్జున్, ఎన్టీఆర్ , పాన్ ఇండియా స్దాయిలో ఆంతర్జాతీయ వేదికలపైన మెరుస్తున్నారు మన్ననపొందుతున్నారు
డైలాగ్‌కింగ్‌గా నటుడు సాయి కుమార్‌కు మంచి పేరుంది. అయితే హీరోగా మాత్రం నిలదొక్కు కోలేక పోయాడు. పోలీస్ స్టోరీ మినహా సాయి కుమార్‌కు అచ్చొచ్చిన సినిమాలేవీ లేవు. దీంతో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా సెటిలయి పోయాడు. తన కోరిక ఎలాగూ తీరలేదు కాబట్టి తన కొడుకు ఆదిని హీరోగా నిలబెట్టి గర్వ పడాలని ఆశ పడ్డాడు. హీరోగా తీర్చి దిద్దాడు. అనుకున్నట్లుగానే ఆది ‘ప్రేమ కావాలి” సినిమాలో అదర గొట్టాడు. ఆ సినిమా మంచి విజయం సాధించినా ఆదికి మాత్రం మళ్లీ సినిమా అవకాశాలు రావడం లేదు. టాలెంట్ ఉన్నప్పటికీ ఆది అగ్రహీరో కొడుకు కాక పోవడమే ఇందుకు కారణం సినిమా హిట్టయినా పెద్దగా డబ్బులు రావనేది నిర్మాతల ఆలోచన కాబోలు.ఈ విషయం గమనించిన సాయికుమార్ స్వయంగా రంగంలోకి దిగి ఆదికి అవకాశాలు వెతికి పెట్టే పనిలో పడ్డాడు. ఇండ్రస్ట్రీలో అందరితో పరిచయాలు ఉండటంతో ప్రతి ఒక్కరికి కలిసి ఆదికి అవకాశం ఇప్పించాలని అడుగుతున్నాడట. పాపం సాయి కుమార్ తన కెరీర్ ను డెవలప్ చేసుకోవడానికి కూడా ఇలాంటి పడరాని పాట్లు పడలేదేమో..?
తొలి సినిమా నుంచి స్టార్ డైరెక్టర్ల డైరెక్షన్ లో నటించేలా జాగ్రత్తలు తీసుకుంటూ ఆ సినిమాల కథ, కథనం విషయంలో నాగ్ జాగ్రత్తలు తీసుకుని ఉంటే చైతన్య, అఖిల్ లకు ఈపాటికి పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు వచ్చేదని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
నాగచైతన్య, అఖిల్ ఖాతాలలో ఇప్పటికీ సరైన ఇండస్ట్రీ హిట్ లేదు.కెరీర్ పరంగా మంచి సక్సెస్ ను అందుకోవడం కోసం ఈ హీరోలు పడుతున్న కష్టం అంతాఇంతా కాదు.నాగ్ ఇప్పటికైనా కొడుకుల కెరీర్ పై ఫోకస్ పెట్టాల్సి ఉంది.చాలామంది యంగ్ హీరోలు వరుస విజయాలు అందుకుంటుండగా నాగచైతన్య, అఖిల్ లకు మాత్రం తమ స్థాయికి తగ్గ విజయాలు దక్కడం లేదు.
చాన్నాళ్లుగా బ్రేక్ కోసం ప్రయత్నిస్తున్నాడు బ్రహ్మానందం తనయుడు రాజా గౌతమ్. కానీ ఇప్పటివరకు సరైన విజయం అందుకోలేకపోయాడు. కనీసం నలుగురు గుర్తించే సినిమా కూడా చేయలేకపోయాడు. దీంతో బాగా సినిమాలు తగ్గించేసిన ఈ నటుడు, ఇప్పుడు మరో ప్రయత్నం చేస్తున్నాడు.