– వై ఎస్ ఆర్ సి పి అభ్యర్థిగా నామినేషన్ వేసిన చిన అప్పలనాయుడు
విజయనగరం, మహానాడు: శాసన మండలి స్థానిక సంస్థల నియోజకవర్గానికి జరుగుతున్న ఉప ఎన్నికల్లో ఒక నామినేషన్ దాఖలు అయింది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా శంబంగి వెంకట చినప్పలనాయుడు గురువారం నామినేషన్ దాఖలు చేశారు. కలెక్టర్ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారి జాయింట్ కలెక్టర్ ఎస్ సేతు మాధవన్ కు మధ్యాహ్నం 1-40 గంటలకు ఆయన తన నామినేషన్ పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా అభ్యర్థి ఎస్.వి. చిన అప్పల నాయుడుతో రిటర్నింగ్ అధికారి ప్రమాణం చేయించారు. జిల్లా రెవెన్యూ అధికారి ఎస్.శ్రీనివాస్ మూర్తి తదితర అధికారులు నామినేషన్ ప్రక్రియను పర్యవేక్షించారు.