రాష్ట్ర బంగారు భవిష్యత్తు కోసం టీడీపీ , జనసేన కలిశాయని జనసేన అధినేత పవన్ కల్యాణ్ పేర్కన్నారు. పొత్తుకు బీజేపీ ఆశీస్సులు కూడా ఉన్నాయని వెల్లడించారు. ఇప్పటం ఘటన నుంచి చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నామని పవన్ పేర్కొన్నారు. వైసీపీ విముక్త ఏపీ కోసం తామంతా కలిసి పని చేస్తామని పవన్ స్పష్టం చేశారు. ఇక పవన్ ఐదుగురితో కూడిన లిస్ట్‌ను విడుదల చేశారు. అయితే బీజేపీ కోసం తన సీట్లను తగ్గించుకున్నానని పవన్ వెల్లడించారు. మన ఓటు టీడీపీకి ఎంత ముఖ్యమో.. టీడీపీ ఓటు మనకు పడటం కూడా అంతే ముఖ్యమని పవన్ అన్నారు.
జనసేన అభ్యర్థులెవరంటే..
తెనాలి – నాదెండ్ల మనోహర్
నెల్లిమర్ల – లోకం మాధవి
అనకాపల్లి – కొణతాల రామకృష్ణ
రాజానగరం – బత్తుల బలరామ కృష్ణ
కాకినాడ రూరల్ – పంతం నానాజీ