గంజాయితో ఐదుగురు అరెస్టు

మంగళగిరి, మహానాడు: మంగళగిరి రూరల్ టోల్ గేట్ దగ్గర గంజాయి అక్రమంగా తరలిస్తున్న తమిళనాడుకు చెందిన ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేసి, రిమాండ్ కు తరలించారు. వీరి నుంచి 230 కిలోల గంజాయి, రెండు కార్లు 6 సెల్ ఫోన్లు, 30 వేలు నగదు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం గంజాయి విలువ 30 లక్షల ఖరీదని మీడియా సమావేశంలో సెబ్ అడిషనల్ ఎస్పీ వెంకటేశ్వర్లు తెలిపారు.