– టీడీపీ అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు బత్తుల తాతయ్య బాబు
అనకాపల్లి, మహానాడు: ప్రజా నాయకుడు తెలుగుదేశం పార్టీ(టీడీపీ) జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడి అక్రమ అరెస్టుకు ఏడాది పూర్తయింది. చంద్రబాబు అభివృద్ధి, సంక్షేమం, సామాజిక న్యాయం ధ్యేయంగా పాలన చేశారు. నీతి, నిజాయితీ, చట్టబద్దత, పారదర్శకత చంద్రబాబు ప్రత్యేకత. అందుచేతనే చంద్రబాబును అక్రమ అరెస్టు చేస్తే వర్గాలకు అతీతంగా రాష్ట్ర ప్రజలందరు ఖండించారని పార్టీ అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు బత్తుల తాతయ్య బాబు అన్నారు. ఈ మేరకు ఆయన విలేఖర్లతో మాట్లాడారు. ఇంకా ఆయన ఏమన్నారంటే.. బాబు అరెస్టును అన్ని రాజకీయ పార్టీలు సంఘీభావం ప్రకటించాయి. దేశవ్యాప్తంగా మద్దతు పలికారు. 70 దేశాల్లో చంద్రబాబుకు సంఘీభావ ప్రదర్శనలు చేశారు. విడుదలైన రోజు రాజమండ్రి నుండి విజయవాడ చేరడానికి రాత్రంతా జనం రోడ్లపై జాగారం చేసి చంద్రబాబుకు స్వాగతం పలికారు. అరెస్టు అయిన ఏ రాజకీయ నేతకు ఇలాంటి సంఘీభావం రాలేదంటే అతిశయోక్తి కాదు. చంద్రబాబుకు నేర ఘటనలో భాగస్వామ్యం ఉన్నట్టు ప్రాథమికంగా కనిపించడం లేదు. రికార్డులను పరిశీలిస్తే కేసు నమోదు చేసిన 22 నెలల తరువాత ఆయనను నిందితుడిగా చేర్చినట్టు స్పష్టమవుతుందన్నారు. జగన్ తన లూటీ నుండి ప్రజల దృష్టిని మళ్ళించడానికి అధికారంలోకి రాగానే చంద్రబాబునాయుడే లక్ష్యంగా రాజధాని భూముల్లో ఇన్ సైడర్ ట్రేడింగ్, ఇన్నర్ రింగ్ రోడ్, స్కిల్ డెవలప్ మెంట్ లో అక్రమాలంటూ తప్పుడు కేసులు నమోదు చేశారని ఆరోపించారు. అదో టెర్రరిస్టు పాలన అని అభివర్ణించారు.