హైదరాబాద్, మహానాడు: రష్యాను ఆకస్మిక వరదలు ముంచెత్తాయి. వేగంగా కరుగుతున్న మంచు యూరప్‌లోని అతి పెద్ద నదుల్లో కొన్నింటిని ముంచెత్తింది. దీంతో ఉరల్ పర్వతాల్లో రికార్డు స్థాయిలో నీటి స్థాయిలు పెరిగాయి. నీటి ఉధృతికి మాస్కోకు తూర్పున 1800 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓర్స్క్ నగరంలోని ఆనకట్ట ఒక్కసారిగా తెగిపోయింది. దీంతో సమీప గ్రామాలను వరద ముంచెత్తింది. సుమారు 10 వేలకు పైగా ఇళ్లు వరద ముంపునకు గురయ్యాయి.