వరద బీభత్సం…వర్ణనాతీతం..!

  • వరద బీభత్స ప్రాంతాల్లో ఎమ్మెల్యే వసంత పర్యటన
  • నడుం లోతు నీటిలో తిరిగి పర్యటించి వరద బాధితులకు భరోసా ఇచ్చిన ఎమ్మెల్యే కేపి
  • బాధిత ప్రజలను చూసి చలించిన ఎమ్మెల్యే వసంత

వరద బీభత్సం వర్ణనాతీతంగా మారింది. అకాల వర్షాలతో వాగులు వంకలు, పొంగి ప్రవహిస్తున్నాయి. ముఖ్యంగా కొండపల్లి మున్సిపాలిటీలో డ్రైనేజీలు ఉధృతంగా మారాయి. ఒకవైపు వర్షం పడుతున్నప్పటికీ మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు గారు తన పర్యటనను కొనసాగించారు. నడుం లోతు నీటిలో తిరిగి పర్యటించి వరద బాధితులకు నేనున్నానంటూ భరోసా ఇచ్చారు. ప్రజలను అప్రమత్తం చేశారు. లోతట్టు ప్రాంతాల వారిని సురక్షిత ప్రదేశాలకు తరలించాలని అధికారులను, మహాకూటమి నాయకులను ఆదేశించారు. ఈ మేరకు మైలవరం నియోజకవర్గంలో యుద్ధ ప్రాతిపదికన సహాయ చర్యలు కొనసాగుతున్నాయి.

కొండపల్లి మున్సిపాలిటీలో ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు శనివారం ఉదయం పర్యటించారు. వరద బాధితుల ప్రజల కష్టాలను చూసి చలించిపోయారు. వారందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలించి తక్షణమే ఆహారం, తాగునీరు సదుపాయాలు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఇంటిలోనే వుండే వారికి ఆహారాన్ని ప్యాకెట్లు రూపంలో అందించాలని ఆదేశించారు. ప్రతి ఇంటికి మినిరల్ వాటర్ పంపిణీ చేయాలని ఆదేశించారు. మైలవరం నియోజకవర్గంలో వరద బీభత్స నష్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టి తీసుకెళ్లి తగు చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.

వరద బీభత్సం తగు ముఖం పట్టే వరకు సహాయ చర్యలు కొనసాగుతాయని పేర్కొన్నారు. ఊహించని విధంగా ఎదురయ్యే ప్రకృతి వైపరీత్యాల నేపథ్యంలో ఎవరికి వారు అప్రమత్తంగా ఉండి సురక్షితంగా ఉండాలని సూచించారు. ఎన్డీఏ కూటమి నాయకులతో పాటు వివిధ శాఖల అధికారులు, ప్రభుత్వ సిబ్బంది అప్రమత్తంగా ఉండి వరద బాధితులకు విస్తృతంగా సేవలను అందించాలన్నారు. స్థానిక ఎన్డీఏ మహాకూటమి నాయకులు అధికారులు తదితరులు పాల్గొన్నారు.