– బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి
విజయవాడ: భారతీయ జనతా పార్టీ రాష్ట్ర స్ధాయిలో నాలుగు విభాగాలుగా సమీక్ష నిర్వహించింది. సుమారు ఎనిమిది గంటల పాటు సుదీర్ఘంగా సమీక్ష నిర్వహించారు. జాతీయ సహసంఘటనా ప్రధాన కార్యదర్శి శివప్రకాష్ జీ సమక్షంలో సమీక్షా సమావేశాలు నిర్వహించారు బిజెపి శాశాన సభ్యుల తో ఒక సమావేశం నిర్వహించారు. అదేవిధంగా ఎన్నికల్లో పోటి చేసిన పార్లమెంటు నియోజకవర్గాలుగా ఒక సమీక్ష అసెంభ్లీ నియోజకవర్గాలు పరంగా ఒక సమావేశం నిర్వహించారు. చివరిగా రాష్ట్ర ఎలక్షన్ మేనేజ్మెంట్ తో ఒక సమావేశం నిర్వహించారు.
శాశన సభ్యుల సమావేశంలో ప్రజా ప్రయోజనాలు కు ప్రాధాన్యత ఇస్తు వారి సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వంలో సమన్వయంతో ముందుకు వెళదామని సమీక్షలో అభిప్రాయ పడ్డారు. జగన్ ఏ తప్పిదాలు చేసి ప్రజలతో చీత్కారానికి గురయ్యారో ఆతప్పిదాలు జరక్కుండా జాగ్రత్తలు పడాలని సమీక్ష సమావేశంలో అబిప్రాయం వ్యక్తం చేశారు.
జూలై మాసం నుండి సంస్ధాగత నిర్మాణం పై ద్రుష్టి కేంద్రీకరించాలని నిర్ణయించారు. ఎన్నికల్లో క్షేత్రస్ధాయిలో బలపడిన నేపధ్యంలో అదే స్ధాయిలో సంస్ధాగతంగా బలపడాలని సమీక్షలో ప్రస్ధావించారు. పార్లమెంటు, అసెంభ్లీ స్ధానాలు లో మంచి గెలుపును సాధించామని అదేవిధంగా ఓటమి చెందిన స్ధానాలు పై కూడా సుదీర్ఘంగానే సమీక్ష నిర్వహించారు.
ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీలో జాతీయ సహ సంఘటనా ప్రధాన కార్యదర్శి శివప్రకాష్ జీ మాట్లాడుతూ ఎన్నికల మేనేజ్మంట్ కమిటీల ద్వారా అనేక రాష్ట్రాల్లో విజయాలు సాధించామన్నారు. ఎన్నికల మేనేజ్మంట్ కమిటీ లో ప్రతి విభాగం చేసిన సర్వీస్ ను డాక్యుమెంట్ రూపంలో ను రాష్ట్రశాఖ కు అదేవిధంగా జాతీయ పార్టీకి పంపించాలన్నారు.
బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి మాట్లాడుతూ శాస్త్రీయ కోణంలో సార్వత్రిక ఎన్నికల్లో పనిచేశామన్నారు. ఎన్నికల మేనేజ్మంట్ కమిటీ చేసిన సర్వీస్ ను శివప్రకాష్ జీ,రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి,శేఖర్ జీ ప్రశంసించారు. బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యులు సోము వీర్రాజు, రాష్ట్రమంత్రి వై. సత్యకుమార్ పార్టీ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.