విజయవాడ, మహానాడు: విజయవాడ బాధితులకు అండగా నిలిచేందుకు శ్రీ గురు కృష్ణ చారిట్రబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో జనసేన, టీడీపీ నాయకులు సహకారంతో 2,000 మందికి సరిపడా ఆహార పొట్లాలను, వాటర్ బాటిల్ లను పంపించే వాహనాన్ని జనసేన పార్టీ నేతలు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా పశ్చిమ నియోజకవర్గ ఇంచార్జి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ ఈ మంచి కార్యానికి పూనుకున్న ప్రతి ఒక్కరికి పేరు పేరునా అభినందనలు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమానికి విచ్చేసి మద్దతు తెలిపిన పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్లా మాధవికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు.