ఆలయ నిర్మాణానికి రూ. 15 లక్షలు మంజూరు

– ఎంపీ పార్థసారధి

హిందూపురం, మహానాడు: హిందూపురం పట్టణం పరిగి రోడ్డు వద్ద నూతనంగా నిర్మించబోయే శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయ భూమిపూజ కార్యక్రమానికి హిందూపురం ఎంపీ బీకే పార్థసారధి హాజరయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నరసింహ స్వామి ఆలయానికి పార్లమెంటు నిధుల నుంచి 15 లక్షలు రూపాయలను విడుదల చేస్తానని హామీ ఇచ్చారు, ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.