Mahanaadu-Logo-PNG-Large

వకుళ మాత శ్రీవారి కృప ఎల్లవేళలా ఉండాలని కోరుకున్నా

– ఈ నెల 15న రెవెన్యూ సదస్సు ఫార్మల్ లాంచింగ్
– 16 నుండి సెప్టెంబర్ 30 వరకు క్షేత్ర స్థాయిలో రెవెన్యూ సదస్సులు: రెవెన్యూ మంత్రి అనగాని సత్య ప్రసాద్
– వకుళమాత ను దర్శించుకున్న రాష్ట్ర రెవెన్యూ, విద్యుత్ శాఖా మంత్రులు

తిరుపతి, ఆగస్టు 12: రైతుల భూ సమస్యల పరిష్కార దిశగా ప్రజల ముంగిటకు గ్రామాలకు అధికారులు వెళ్లి పరిష్కరించే విధంగా ఈ ఆగస్ట్ నెల 15 న ఫార్మల్ లాంచింగ్ చేసి ఈ నెల 16 నుండి సెప్టెంబర్ 30 వరకు కార్యక్రమాలు రెవెన్యూ శాఖ నుండి చేపడుతున్నామని రాష్ట్ర రెవిన్యూ శాఖ మంత్రి అనగాని సత్య ప్రసాద్ పేర్కొన్నారు.

సోమవారం ఉదయం స్థానిక పేరూరు లోని వకుళమాత ను రెవెన్యూ శాఖామంత్రి, విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ దర్శించుకున్నారు. అనంతరం రెవెన్యూ శాఖ మంత్రి మీడియాతో మాట్లాడుతూ వేంకటేశ్వర స్వామి, వకుళమాత అమ్మవారి కృప రాష్ట్రం పై ఎప్పుడు ఉండాలని కోరుకున్నానని అన్నారు.

అన్ని రంగాలలో గత ప్రభుత్వంలో వెనుకబడిన రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు తీసుకువెళ్ళాలని రాష్ట్ర ప్రజలు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని గెలిపించడం జరిగిందని, ఆ దిశగా ఒక ప్రణాళిక బద్దంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు.

చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా రైతుల భూ సమస్యల పరిష్కార దిశగా ప్రజల ముంగిటకు గ్రామాలకు రెవెన్యూ సంబంధిత అధికారులు వెళ్లి పరిష్కరించే విధంగా ఈ ఆగస్ట్ నెల 15న ఫార్మల్ లాంచింగ్ చేసి ఈ నెల 16 నుండి సెప్టెంబర్ 30 వరకు కార్యాచరణ ప్రణాళికతో కార్యక్రమాలు రెవెన్యూ శాఖ నుండి చేపడుతున్నామని తెలిపారు.

గత ప్రభుత్వంలో రియల్ టైమ్ గవర్నెన్స్ ను పూర్తిగా నిర్వీర్యం చేసిందని, మన ప్రభుత్వంలో రియల్ టైమ్ గవర్నెన్స్ , కాల్ సెంటర్లు అందుబాటు లోకి తీసుకు వచ్చే విధంగా కొత్త కార్యాచరణ చేయనున్నామని తెలిపారు