మాజీ సీఎం జగన్ బెంగళూరు పర్యటన ముగించుకొని గురువారం సాయంత్రం గన్నవరం విమానాశ్రయంకు చేరుకున్నారు. జగన్ కి గన్నవరం విమానాశ్రయంలో వైసీపీ నాయకులు ఘన స్వాగతం పలికారు. అక్కడ నుండి రోడ్డు మార్గంలో తాడేపల్లి బయలుదేరి వెళ్లారు. పల్నాడు జిల్లా వినుకొండలో వైసీపీ కార్యకర్త రషీద్ ను దారుణంగా హత్య చేసిన నేపథ్యంలో రేపు వినుకొండ వెళ్లి రషీద్ కుటుంబ సభ్యులను జగన్ పరామర్శించనున్నారు.