పోలీసు కస్టడీలో మాజీ ఎంపీ నందిగం సురేష్‌

మంగళగిరి, మహానాడు: వైఎస్సార్ సీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ ను విచారణ నిమిత్తం మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ కు పోలీసులు తీసుకొచ్చారు. తెలుగుదేశం పార్టీ(టీడీపీ) రాష్ట్ర కార్యాలయం పై దాడి కి సంబంధించిన కేసులో ఈనెల అయిదోతేదీన అరెస్ట్ చేయడంతో కోర్టు రిమాండ్ కు పంపింది. కోర్టు రెండు రోజుల పాటు సెప్టెంబర్ 15 నుండి 17 వరకు పోలీస్ కస్టడీకి అనుమతించింది. ఈ నేపథ్యంలో ఆదివారం మధ్యాహ్నం విచారణ అధికారి మంగళగిరి రూరల్ సర్కిల్ కార్యాలయానికి చేరుకున్నారు.