సాదరంగా ఆహ్వానించిన చంద్రబాబు, జ్యోతుల నెహ్రూ
కాకినాడ జిల్లా జగ్గంపేట: జగ్గంపేట గ్రామపంచాయతీ మాజీ సర్పంచ్ దివంగత నేత తోలుగంటి గోవింద్‌రెడ్డి కుమారుడు ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, భార్య నాగసాహితి, గోవింద్ రెడ్డి భార్య ఉదయభాస్కరి వైసీపీకి రాజీనామా చేసి టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు, రాష్ట్ర పార్టీ ఉపాధ్యక్షుడు జ్యోతుల నెహ్రూ సమక్షంలో టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ జగ్గంపేట గ్రామపంచాయతీకి అనేక అభివృద్ధి కార్యక్రమాలతో ప్రజల మనసుల్లో ఉన్న వ్యక్తి కుటుంబం మన పార్టీలోకి రావడం జగ్గంపేట పార్టీకి మరింత బలం చేకూరిందన్నారు. కష్టపడి పార్టీ కోసం పనిచేయాలని, తగిన గుర్తింపు ఇస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జ్యోతుల నవీన్, జ్యోతుల లక్ష్మీదేవి, ఎస్వీఎస్ అప్పలరాజు, మారి శెట్టి భద్రం, కొత్త కొండబాబు, జీను మణిబాబు, పాండ్రంగి రాంబాబు, తదితరులు పాల్గొన్నారు.