Mahanaadu-Logo-PNG-Large

తొలిసారి ఓడిన సిక్కిం మాజీ సీఎం చామ్లింగ్‌

సిక్కిం: సిక్కిం అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ప్రతిపక్ష ఎస్డీఎఫ్‌ పార్టీ ఘోర పరాజ యం పాలైంది. ఒక్క సీటుకే పరిమితమైన ఈ పార్టీ 2019తో పోలిస్తే 14 సీట్లను కోల్పోయింది. తాజా ఫలితాల్లో ఆ పార్టీ చీఫ్‌, మాజీ సీఎం పవన్‌కుమార్‌ చామ్లింగ్‌ 39 ఏళ్ల రాజకీయ జీవితంలో తొలిసారిగా ఓటమి చవిచూశారు. ఆయన పోటీ చేసిన రెండు స్థానాల్లోనూ ఓడిపోవడం గమనార్హం. 1985 నుంచి వరుసగా 8 సార్లు ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1994-2019 వరకు సిక్కిం సీఎంగా పనిచేశారు.