Mahanaadu-Logo-PNG-Large

మాజీ స్పీకర్ పోచారం పై బాజిరెడ్డి గోవర్ధన్ ఫైర్

హైదారాబాద్, జూన్ 21 మహానాడు : బీ ఆర్ ఎస్ సీనియర్ నేత బాజిరెడ్డి గోవర్ధన్ మాజీ స్పీకర్ పోచారం పై శ్రీనివాస్ రెడ్డి ఫైర్ అయ్యారు.

పోచారం శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీ లో చేరారు.ఆయన గతంలో మాట్లాడిన మాటలు వింటుంటే మాకే సిగ్గేస్తుందన్నారు.

వ్యవసాయ, రైతాంగం అంశాల్లో రేవంత్ రెడ్డి అనేక సంస్కరణలు చేస్తున్నట్టు చెప్పటం చూస్తుంటే దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందనీ,రేవంత్ రెడ్డి రాష్ట్రానికి చేసిన ద్రోహం తెలిసి కూడా పోచారం పార్టీ మారారంటే కొద్దిగానైనా సిగ్గు ఉండాలి అన్నారు.

వ్యవసాయ శాఖ మంత్రి, స్పీకర్ గా అవకాశం ఇచ్చిన కేసిఆర్ ను వదలి నీళ్ళు, కరెంట్, రైతు బంధు ఇచ్చిన వ్యక్తి కేసిఆర్ ను చూసి కూడా పార్టీ మారటం ఏంటి? కరెంట్ ఇవ్వలేని, రైతు బంధు ఇవ్వలేని, నీళ్ళు ఇవ్వలేని రేవంత్ రెడ్డి పంచన చేరాడు. వృద్ధాప్యం లో వచ్చిన నువ్వు ఇలాంటి పరిస్థితుల్లో పార్టీ ఎందుకు మారావు అన్నారు.

పార్లమెంట్ ఎన్నికల్లో నిన్ను నీ కొడుకు ను దండు పాల్యం బ్యాచ్ అన్నాడు రేవంత్ రెడ్డి.మా జిల్లాలో మరో డీఎస్ లాగా తయారయ్యాడు.నీకు గౌరవం అనేది ఉంటే పార్టీకి రాజీనామా చేసి మళ్ళీ గెలువు అని ఎద్దేవా చేశారు.

నీలాంటి వాళ్ళుపార్టీ మారటం వల్ల బీ ఆర్ ఎస్ పార్టీకి వచ్చే నష్టం ఏమి లేదు. కేసిఆర్ ఏం తక్కువ చేశాడు,అన్ని పదవులు ఇచ్చాడు. భావి తరాలకు ఏం మెసేజ్ ఇస్తున్నావు ఈ వయస్సు లో కృష్ణ రామ అంటూ మనుమరాలుతో ఆడుకోకుండా ఏం బుద్ది నీకు ఇప్పుడు అని పోచారం పై ఆగ్రహం వ్యక్తం చేశారు .