పవర్ మిక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచితంగా నోట్ పుస్తకాలు పంపిణీ

  • ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య చేతుల మీదుగా విద్యార్థులకు నోట్ పుస్తకాలు అందజేసిన పవర్ మిక్ సంస్థ ప్రతినిధులు
  • విద్యార్థులు క్రమశిక్షణతో విద్యను అభ్యసించాలి
  • ప్రతి ఒక్కరూ ఉజ్వల భవిష్యత్తుకు కష్టపడి చదవాలి
  • ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య

ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న పేద విద్యార్థులకు ఉచితంగా 3500 నోటు పుస్తకాలును పవర్ మీకు సంస్థ హైదరాబాదు వారు అందించడం పట్ల నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య సంస్థ వారికి కృతజ్ఞతలు తెలిపారు.

మంగళవారం నాడు నందిగామ పట్టణం స్థానిక కాకాని నగర్ కార్యాలయంలో పవర్ మిక్ సంస్థ వారు అందించిన 3500 నోటు పుస్తకాలను ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య చేతుల మీదుగా విద్యార్థులకు అందజేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే పిల్లలు వారు అందించే ఈ సహకారంతోపాటు పిల్లలు కూడా బాగా చదువుకొని ఉన్నత స్థితికి చేరుకోవాలని కోరారు భవిష్యత్తులో కూడా మరింతమంది పేద పిల్లలను పవర్ మిక్ సంస్థ ఫౌండేషన్ ఆదుకోవాలని ఆయన కోరారు.

విద్యార్థులు క్రమశిక్షణతో విద్యను అభ్యసించాలన్నారు. జీవితంలో విద్యార్థి దశ చాలా కీలకమైనదని, ప్రతి ఒక్కరూ ఉజ్వల భవిష్యత్తుకు కష్టపడి చదవాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్కానర్ ద్వారా లక్ష రూపాయలు స్థానిక నేతలతో పాటు పౌరమిక్ సంస్థ ప్రతినిధులు వాసిరెడ్డి శ్రీనివాస్, శిరీష, గిరి తదితరులు పాల్గొన్నారు.