ఆంధ్రాలో ఉచిత గ్యాస్ బుకింగ్ రేపటి నుంచి..

విజయవాడ, మహానాడు: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఉచిత గ్యాస్ సిలిండర్ల బుకింగ్ రేపటి నుంచి ప్రారంభం కానుంది. ఈ నెల 29 ఉదయం 10 గంటల నుంచి గ్యాస్ బుకింగ్ చేసుకోవచ్చని, గ్యాస్ కనెక్షన్ తో పాటు తెల్ల రేషన్ కార్డు, ఆధార్ కార్డు ఉండాలని మంత్రి నాదెండ్ల మనోహర్‌ ఒక ప్రకటనలో తెలిపారు.