దీపావళి నుంచి ఉచిత గ్యాస్‌…మహిళల సంబరాలు!

– ఎమ్మెల్యే గళ్ళా మాధవి

గుంటూరు, మహానాడు: ఎన్డీయే ప్రభుత్వం దీపావళి పండుగ కానుకగా ఉచిత గ్యాస్ సిలెండర్ ఇవ్వనుందన్న ప్రకటనతో మహిళల నుండి పెద్ద ఎత్తున హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్ళ మాధవి పేర్కొన్నారు. పార్టీ స్థానిక కార్యాలయంలో శుక్రవారం ఎమ్మెల్యే ఆధ్వర్యంలో తెలుగు మహిళలతో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఫ్లెక్సి కి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో భాగంగా వాటిని నెరవేర్చే క్రమంలో మరో ముందడుగు వేశారని తెలిపారు. అర్హులైన ప్రతి మహిళకు ఈ ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం అమలవుతుందన్నారు. దీనిపట్ల మహిళల నుండే కాక ప్రజల నుండి పెద్ద ఎత్తున హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయన్నారు.

దీన్ని చూసి తట్టుకోలేక జగన్మోహన్ రెడ్డి లాంటి వారు ఎన్ని విష ప్రచారాలు చేసిన ప్రజలందరూ తమవైపే ఉంటారన్నారు.
ఈ కార్యక్రమంలో దాసరి జ్యోతి, డాక్టర్ కల్పన, నేపాక పద్మ, కార్పొరేటర్ శ్రీవల్లి, లాం నవమి, విజయలక్ష్మి, వకుల దేవి, మీనాక్షి, కరిమూన్, శోభారాణి తదితరులు పాల్గొన్నారు.

పీవీకే నాయుడు మార్కెట్ ఎమ్మెల్యే సందర్శన
పశ్చిమ నియోజకవర్గంలోని పీవీకే నాయుడు కూరగాయల మార్కెట్ ఎమ్మెల్యే గళ్ళా మాధవి శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా ప్రజలు, వ్యాపారస్తుల నుండి అక్కడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. మార్కెట్ లో ఉన్న మరుగుదొడ్లు నిర్లక్ష్యం కారణంగా శిథిలమైపోయాయని గుర్తించిన ఎమ్మెల్యే వెంటనే అధికారులను పిలిచి, ఈ మరుగుదొడ్లను వాడుకలోకి తీసుకురావాలని ఆదేశించారు. వర్షాకాలంలో వరద నీరు మొత్తం మార్కెట్ లో నిలిచిపోతున్నదని వ్యాపారస్తులు తెలపగా, అధికారులను వీటి సమస్య పరిష్కారానికి మార్గాలను అన్వేషించి, అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సాదు రాజేష్, నిమ్మల రమణ, లాం వర్ధన్ రావు, ఆళ్ళ హరి, ఖర్జూర శ్రీను, దళవాయి కిషోర్, శర్ఫుద్దిన్ తదితరులు పాల్గొన్నారు.