టీడీపీ గుంటూరు నగర అధ్యక్షుడు డేగల ప్రభాకర్
గుంటూరు, మహానాడు: ప్రభుత్వం రాష్ట్ర ప్రగతికి బాటలు వేస్తూ ఉచిత ఇసుక పాలసీ తీసుకురావడం అభినందనీయమని తెలుగుదేశం పార్టీ గుంటూరు నగర అధ్యక్షుడు డేగల ప్రభాకర్ అన్నారు. అర్బన్ పార్టీ కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఉచిత ఇసుక విధానం వల్ల సామాన్యులకు భారీ ఊరట లభించిందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీని చంద్రబాబు అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లో అమల్లోకి తీసుకొచ్చారన్నారు. ఉచిత ఇసుక పాలసీ అమలు…బడుగు,బలహీన వర్గాల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం బాటలు వేస్తుందన్నారు.
నాణ్యమైన ఇసుక ప్రజలకు అందుబాటులో ఉండాలన్నదే టీడీపీ విధానం అని అన్నారు. గత జగన్ రెడ్డి ప్రభుత్వం ఇసుక మాఫియాను నడిపిందని ఆరోపించారు.ఒక్క ఇసుక కుంభకోణం ద్వారానే రూ.50 వేల కోట్లకు పైగా కొల్లగొట్టారని మండిపడ్డారు. వైసీపీ నేతలు స్వయంగా ఇసుకాసుర అవతారం ఎత్తి దోచుకున్నారు. వైసీపీ నేతలు మింగేసిన ఇసుకతో దాదాపు 10 లక్షల పైగా ఇల్లు కట్టుకునేవారని, వారి అవినీతి ఏ స్థాయిలో అవినీతి చేశారు అర్థం చేసుకోవచ్చన్నారు.
పారదర్శకత ముందుచూపుతో ముఖ్యమంత్రి చంద్రబాబు శాండ్డ్ పాలసీ రూపొందించారన్నారు. ఉచిత ఇసుక విధానం వల్ల ఎన్నో లక్షల కుటుంబాలకు ఉపాధి లభిస్తుందన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చి రాష్ట్రాన్ని అభివృద్ధిలో నడపడమే కూటమి లక్ష్యమన్నారు.