– ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు
వినుకొండ, మహానాడు: ఐదేళ్ల చీకట్లు చీల్చుకుంటూ కొత్త వెలుగుల్లోకి అడుగు పెడుతున్న వినుకొండ నియోజకవర్గం, రాష్ట్ర ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలని ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. కొత్త నాయకత్వంలో, కొత్తలక్ష్యాలతో అభివృద్ధిబాటలో రాష్ట్రం ముందుకు సాగుతున్న తరుణంలో వస్తున్న ఈ దీపావళి పండుగ ప్రజలందరీ జీవితాల్లో ఆనందం, ఐశ్వర్యం, ఆరోగ్యాలు తేవాలని ఆకాంక్షించారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు చల్లని, సమర్థ పాలనలో రాష్ట్రంలోని ప్రతి లోగిలి కొత్తవెలుగులు, సంతోషాలతో నిండాలని ఆ భగవంతుడుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అన్నారు. పండగ వెలుగులు చీకట్లను తరిమివేసినట్టే సమస్యలను, సవాళ్లనూ తొలగించి నవ్యాం ధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రప్రదేశ్‌గా మారేందుకు బాటలు వేయాలన్నదే ఈ పండుగకు తన సంకల్పం అన్నారు. జగనాసుర విముక్తమై, ప్రజలందరు స్వేచ్ఛా, సంతోషాలతో సంబరాలు చేసుకుంటు న్న ఈ దీపావళి రాష్ట్ర చరిత్రలో ప్రత్యేకంగా నిలిచిపోతుందన్నారు.