వైసీపీ నుంచి జనసేనలోకి…

– పార్టీ కండువా వేసి, ఆహ్వానించిన పవన్‌ కల్యాణ్‌

విజయవాడ, మహానాడు: జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో వైసీపీ నుంచి పలువురు నాయకులు శనివారం జనసేన పార్టీ అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ సమక్షంలో జనసేనలో చేరారు. రాజమహేంద్రవరానికి చెందిన క్రాంతి దంపతులు, అమలాపురానికి చెందిన కల్వకొలను తాతాజీ, గుంటూరుకు చెందిన చందు సాంబశివరావు పార్టీలో చేరారు. వీరికి పవన్ కల్యాణ్‌ పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. క్రాంతి… వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం కుమార్తె. గుంటూరు నగరపాలక సంస్థ కార్పొరేటర్లు నిమ్మల వెంకట రమణ, సంకూరి శ్రీనివాసరావు, ఇర్రి ధనలక్ష్మి, అయిశెట్టి కనకదుర్గ పార్టీలో చేరారు.

జగ్గయ్యపేట మున్సిపాలిటి కౌన్సిలర్లు కొలగాని రాము, కాశీ అనురాధ, తుమ్మల ప్రభాకర్ రావు, కాటగాని శివ కుమారి, తన్నీరు నాగమణి, సాధుపాటి రాజా, పాకలపాటి సుందరమ్మ, షేక్ సిరాజున్, మోరే సరస్వతి, పండుల రోశయ్య, కో ఆప్షన్ మెంబర్లు చైతన్య శర్మ, ఖాదర్ బాషా, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు ఆకుల బాజీ, వీరయ్య చౌదరి జనసేనలో చేరిన వారిలో ఉన్నారు.