గజదొంగ జగన్‌ను తరిమికొట్టాలి

సత్తెనపల్లి టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ
బృగుబండలో ఎన్నికల ప్రచారం

సత్తెనపల్లి: సత్తెనపల్లి రూరల్‌ మండలం బృగుబండ గ్రామంలో సత్తెనపల్లి టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారా యణ బుధవారం న్నికల ప్రచారం నిర్వహించారు. ఆయన వెంట నరసరావుపేట టీడీపీ ఎంపీ అభ్యర్థి శ్రీకృష్ణదేవరాయలు సతీమణి మేఘన కూడా పాల్గొన్నారు. జగన్‌ అనే గజదొంగను తరిమికొట్టడానికి జనం చేతిలో ఆయుధం ఓటుతో బుద్ధి చెప్పాలని కోరారు. బీసీ వర్గాలకు ఏర్పాటు చేసిన కార్పొరేషన్‌ను నిర్వీర్యం చేసి, పథకాలను రద్దు చేశావు. మైనారిటీల కోసం అమలు చేసిన పథకాలను ఎత్తి వేశావు. పరిశ్రమలను తరిమేసి నిరుద్యోగ యువశక్తిని నిర్వీర్యం చేశారు. చేసిన వాగ్దానాలు ఒక్కటి కూడా అమలు చేయకుండా 98 శాతం అమలు చేశానని అబద్ధపు ప్రచారాలు చేస్తూ ప్రజలను మోసం చేస్తున్నావు. చంద్రబాబు కట్టించిన లక్షలాది టిడ్కో ఇళ్లను వారికి ఇవ్వకుండా పాడు పెడుతూ కోట్లాది ప్రజల ఆస్తిని నాశనం చేశావు. కూటమి తుఫాన్‌ తాకిడికి ఫ్యాన్‌ కొట్టుకు పోవడం ఖాయమన్నారు. ఈ ప్రచారంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.