-ప్రజలు పోరాడితేనే సోనియమ్మ ఇచ్చింది
-సీఎం అయ్యాక లక్షల కోట్లు దోచావ్
-మందకృష్ణ మాదిగల నాయకుడు కాదు
-కాంగ్రెస్ నేత గజ్జల కాంతం విమర్శలు
హైదరాబాద్: నిజమైన తెలంగాణ సాధించడం కోసం మేం పోరాడాం…కేసీఆర్ నువ్వొక్కడివి పోరాడితేనే తెలంగాణ వచ్చిందా? అని కాంగ్రెస్ నాయకులు గజ్జల కాంతం ప్రశ్నించారు. గాంధీభవన్‌లో గురువారం మీడియా సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ మీద అనవసరమైన ఆరోపణలు చేస్తున్నారు. ఆనాడు నేను చంద్రబాబు నాయుడు, జగన్ దగ్గరకు వెళ్లి లేఖ రాయించాను. తెలంగాణ రాష్ట్రం ఇవ్వడం ఇష్టం లేకపోతే సోనియమ్మ తెలంగాణ ఎందుకు ఇస్తుంది? కేసీఆర్ తన కుటుంబం కోసం అధికారంలో ఉండడం కోసమే తెలంగాణ తెచ్చారు కానీ, ప్రజల కోసం కాదు. కాంగ్రెస్ పార్టీ సోనియమ్మ కాళ్లు మొక్కి తెలంగాణ ప్రజల పరిస్థితి వివరించి రాష్ట్ర ఏర్పాటుకు కృషి చేసింది.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత రాష్ట్రం దొరల చేతుల్లోకి వెళ్లిపోయింది. కేసీఆర్ పాలనలో ఆంధ్ర బడా బాబులకే ఉద్యోగాలు కల్పించడం వాస్తవం కాదా? మీ ఒక్కరి కార ణంగానే తెలంగాణ వచ్చింది అనడం సమంజసం కాదు. తెలంగాణ ప్రజలంతా కలిసి పోరాడితేనే తెలంగాణ వచ్చింది. 2014లో పార్లమెంట్ బిల్ వచ్చాక సీఎం అయ్యి ప్రాజెక్టుల పేరుతో లక్షల కోట్లు దోచుకున్నాడు. మందకృష్ణ మాదిగల నాయకుడు కాదు బీజేపీ నాయకుడు. రిజర్వేషన్ పెంచాలని ఎలా మాట్లాడుతున్నా రు? రిసేర్వేషన్ పెంచే అధికారం రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లో ఉండదని మీకు తెలియదా? అవగాహన లేని మాటలు మాట్లాడకూడదని హితవుపలికారు.