గుంటూరు, మహానాడు : గుంటూరు 23వ డివిజన్‌లో ఏసీ కాలేజీ ఎదురు దరియా నగర్ నుంచి బుధవారం గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి గళ్లా మాధవి ఎన్నికల ప్రచార కార్యక్ర మంలో పాల్గొన్నారు. ఆమెతో పాటు పశ్చిమ నియోజకవర్గ నాయకులు తాళ్ళ వెంకటేష్ యాదవ్ పాల్గొన్నారు.
తాళ్ళ వెంకటేష్ యాదవ్ మాట్లాడుతూ ఇక్కడ ప్రజలు అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. రాష్ట్రం బాగుపడాలంటే కూటమిని గెలిపించుకోవాలని, టీడీపీ అభ్యర్థికి ఓటు వేయాలని అభ్యర్థించారు. వారి వెంట టీడీపీ నాయకులు ఉన్నారు.