గుంటూరు, మహానాడు: గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి గళ్లా మాధవి ఆదివారం 25వ డివిజన్లో ముమ్మరంగా ఎన్నికల ప్రచార కార్యక్రమం నిర్వహించారు. స్థానిక ప్రజలు పెద్దఎత్తున ఆమెకు ఘనస్వాగతం పలికి పూలవర్షం కురిపించారు. మీ ఇంటి ఆడపడుచుగా మీ వద్దకు వచ్చానని.. తనను ఆదరిస్తే మీకు అండగా ఉంటానని ఈ సందర్భంగా మాధవి వారికి భరోసా ఇచ్చారు. ప్రచారంలో జోన్ 5 టీడీపీ ఇన్చార్జి కోవెలమూడి రవీంద్ర, జనసేన జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరావు, రాష్ర ప్రధాన కార్యదర్శి బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ కూడా పాల్గొన్నారు.