అంబేద్కర్‌కు గళ్లా మాధవి నివాళి

గుంటూరు, మహానాడు: గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో ఆదివారం భారతరత్న అంబేద్కర్‌ జయంతి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పశ్చిమ నియోజవర్గం టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి గళ్లా మాధవి పాల్గొన్నారు. సామాజిక అణచివేత, వివక్షలను రూపుమాపి దళిత వర్గాల అభ్యున్నతికి పాటుపడిన అంబేద్కర్‌ అందరికీ ఆదర్శమన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు, కార్యకర్తలు, దళిత నేతలు పాల్గొన్నారు.