తాళ్లూరు, మహానాడు: తాళ్లూరు మండలం బొద్దికూరపాడు గ్రామం బీసీ కాలనీలో ఏర్పాటు చేసిన విఘ్నేశ్వరుడి నిమజ్జనం సందర్భంగా వినాయక మండపం వద్ద పూజలు అందుకున్న 50 కేజీల లడ్డు ప్రసాదాన్ని ముస్లిం యువకుడు షేక్ కమాల్ వలి వేలం పాటలో 26 వేల రూపాయలకు దక్కించుకున్నాడు. ముస్లిం యువకుడు గణేష్ లడ్డు దక్కించుకోవడం పట్ల హిందూ, ముస్లింలు ఆనందం వ్యక్తం చేస్తూ, మా గ్రామం మతసామరస్యానికి ప్రతీక అంటూ బొద్దికూరుపాడు గ్రామ ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.