Mahanaadu-Logo-PNG-Large

ప్రభుత్వ కాంప్లెక్స్ భవనాలను నోటిఫై చేస్తూ గెజిట్

– సీఆర్డీఏ కమిషనర్ భాస్కర్

అమరావతి: అమరావతిలో చేపట్టనున్న ప్రభుత్వ కాంప్లెక్స్ భవనాలను నోటిఫై చేస్తూ సీఆర్డీఏ గెజిట్ జారీ చేసింది. మాస్టర్ ప్లాన్ ప్రకారం అమరావతిలో ప్రభుత్వ కాంప్లెక్స్ భవనాలు నిర్మించనున్నారు. ప్రభుత్వ కాంప్లెక్స్ ప్రాంతమైన 1575 ఎకరాల ప్రాంతాన్ని సీఆర్డీఏ నోటిఫై చేసింది. మాస్టర్ ప్లాన్లో భాగంగా జోనింగ్ నిబంధనల ప్రకారం నోటిఫై చేస్తున్నట్లు ప్రకటన జారీ చేసింది. రాయపూడి, నేలపాడు, లింగాయపాలెం, శాఖమూరు, కొండమరాజుపాలెం సరిహద్దుల్లో ఉన్న ప్రాంతాన్ని నోటిఫై చేసినట్లు సీఆర్డీఏ కమిషనర్ భాస్కర్ వెల్లడించారు.