– మాజీ సీఎం జగన్
విజయవాడ, మహానాడు: పాడేరు, మార్కాపురం, ఆదోని, పులివెందుల, మదనపల్లె మెడికల్ కాలేజీలకు కేంద్రం నుంచి అనుమతులు తీసుకురావాలని సీఎం చంద్రబాబును మాజీ సీఎం వైఎస్ జగన్ కోరారు. ఈ కళాశాలలు అందుబాటులోకి వస్తే 750 మంది పేద విద్యార్థులకు సీట్లు లభిస్తాయని ఎక్స్లో తెలిపారు. ‘మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేయొద్దు. ఇలాంటి విధానాలను ఇప్పటికైనా మానుకోండి. కేంద్రం మెడలు వంచి వాటికి అనుమతి తీసుకురావాలి’ అని ఆయన పేర్కొన్నారు.