మైదుకూరు కూటమి అభ్యర్థి పుట్టా సుధాకర్ యాదవ్
మైదుకూరు, మహానాడు: ఒక్క అవకాశం ఇవ్వండి…మైదుకూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుందామని మైదుకూరు నియోజకవర్గ కూటమి అభ్యర్థి పుట్టా సుధాకర్ యాదవ్ పిలుపునిచ్చారు. మైదుకూరు మున్సిపాలిటీ 12వ వార్దులో బుధవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రతి ఇంటికి వెళ్లి టీడీపీ మినీ మేనిఫె స్టోలోని పథకాలను వివరించారు. ఆయనతో పాటు కడప పార్లమెంట్ అభ్యర్థి చదిపిరాళ్ల భూపేష్ కూడా ఉన్నారు. రాజోలు ఆనకట్ట దిగువున ఉన్న 90 వేల ఎకరాల రైతుల కోసం, మునిసిపాలిటీ అభివృద్ధి కోసం, సమస్యల శాశ్వత పరిష్కారం కోసం తమను గెలిపించాలని కోరారు.