మాచర్ల, మహానాడు: మాచర్ల మండలం, నాగార్జునసాగర్ అంతర్రాష్ట్ర చెక్ పోస్ట్ వద్ద అక్రమంగా తరలిస్తున్న రూ.4,54,000 లక్షల విలువచేసే గోవా మద్యంను పోలీసులు పట్టుకున్నారు. గోవా నుంచి గుంటూరుకు అక్రమంగా 1236 మద్యం ఫుల్ బాటిళ్లు, 72 బీర్ టిన్నులను అశోక్ లైలాండ్ వాహనంలో తరలిస్తుండగా దాడి చేసి పట్టుకున్నారు. మాచర్ల రూరల్ సీఐ నఫీజ్ బాషా మాట్లాడుతూ.. నాగార్జునసాగర్ అంతర్రాష్ట్ర చెక్పోస్ట్ వద్ద మంగళవారం ఉదయం 5 గంటలకు వాహనాలు అనుమానాస్పదంగా ఉన్న వెహికల్ ని ఆపి తనిఖీ చేయగా భారీగా గోవా రాష్ట్రానికి చెందిన అక్రమ మద్యం పట్టుబడిందని చెప్పారు.
డ్రైవర్ ని అదుపులోకి తీసుకొని విచారించగా మద్యాన్ని గోవా రాష్ట్రం నుండి గుంటూరు కి తరలిస్తున్నట్టుగా తెలిపారని పేర్కొన్నారు. ఇద్దరు నిందితుల వద్ద నుండి 1236 ఫుల్ బాటిల్స్ మద్యం, 72 బీరు కేసులు స్వాధీనం చేసుకొని వాహనాన్ని సీజ్ చేసి కేసు నమోదు చేసి కోర్టుకి హాజరు పరుస్తామని తెలిపారు. ఎవరైనా అక్రమంగా చట్టానికి వ్యతిరేకంగా బియ్యం, లిక్కర్, మైనింగ్ కి సంబంధించి అక్రమ రవాణా చేస్తే కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.