జగన్ రెడ్డికి దేవుడు మంచి బుద్ధి ఇవ్వాలి

– టీడీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు గండి బాబ్జి

విశాఖపట్నం, మహానాడు: జగన్ రెడ్డికి దేవుడు మంచి బుద్ధి ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ(టీడీపీ) జిల్లా అధ్యక్షుడు గండి బాబ్జి అన్నారు. మంగళవారం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఇబ్బందులు వస్తున్నా కూడా వాటిని అధిగమించి సీఎం చంద్రబాబు పరిపాలన అందిస్తున్నారని అన్నారు.
జగన్మోహన్ రెడ్డి అక్రమ కేసులు పెట్టి చంద్రబాబు నాయుడు ను జైలు లో పెట్టి ఏడాది పూర్తి అయింది.

జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పులకు రాష్ట్ర ప్రజలు తగిన బుద్ధి చెప్పారన్నారు. బుడమేరు పరిస్థితి తెలియని జగన్మోహన్ రెడ్డి రోజుకో అబద్ధం ఆడుతున్నారు… ప్రభుత్వం వలనే విజయవాడ కు వరదలు వచ్చాయని అసత్య ప్రచారాలు చేస్తున్నారని, సీఎం చంద్రబాబు కు ఏడు పదులు వయస్సు లోను విజయవాడ వరదలు ప్రాంతాలను పర్యటిస్తూ సహాయక చర్యలు పరిశీలించారని తెలిపారు. ఇవే వరదలు జగన్మోహన్ రెడ్డి సీఎం గా ఉన్నపుడు వస్తే ఏరియల్ సర్వే చేసి మామా అనిపించేవారు అని ఎద్దేవా చేశారు. జగన్మోహన్ రెడ్డి విజయవాడలో రెండు ప్రాంతంలో పర్యటించి ఒక కోటి రూపాయలు విరాళం ఇచ్చి చేతులు దులుపుకొన్నారని విమర్శించారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ను చూసి జగన్ బుద్ధి తెచ్చుకోవాలని సూచించారు. విజయవాడ పట్టణాన్ని ముంచాలని వైసీపీ నాయకులు ప్రయత్నం చేశారు, ప్రభుత్వం విఫలమైందని చూపించాలని అనుకున్నారు. వ్యూహం బెడిసికొట్టిందన్నారు.

వైసీపీ ని ప్రజలు గుర్తించాలంటే ఇప్పటికైనా వైసీపీ నాయకులు మారాలి. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుంచి సీఎం చంద్రబాబు ఒక్కొక్క హామీని నెరవేర్చుకుంటూ వస్తున్నారు. ఎన్నికలలో ప్రజలకు ఇచ్చిన హామీలు కు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. ఉత్తరాంధ్రలోని ఉన్న సమస్యలు పరిష్కరిస్తాం.. సీఎం చంద్రబాబు నాయుడు కు ప్రజలు ఆశీస్సులు, సహకారాలు అందించాలన్నారు. విలేఖర్ల సమావేశంలో కార్పొరేటర్లు ఉరుకూటి నారాయణ, విల్లూరి భాస్కర రావు, మహిళా అధికార ప్రతినిధి ఈతలపాక సుజాత, విల్లూరి చక్రవర్తి, తెలుగు యువత రాష్ట్ర ఉపాధ్యక్షుడు తమ్మినేని మోహన్ రావు, తదితరులు ఉన్నారు.